Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : విదేశాల్లో బొగ్గు ఆధారిత కొత్త విద్యుత్ ప్రాజెక్టులను నిలిపేస్తున్నట్లు చైనా చేసిన ప్రకటనను ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ (ఎఐఐబి) స్వాగతించింది. ''చైనాకు, మిగిలిన ప్రపంచానికి సంబంధించినంతవరకు ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమని ఎఐఐబి పేర్కొంది. భూగోళం వేడెక్కడం ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అని, భూ తాపాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న యత్నాల పట్ల చైనా నిబద్ధతను తెలియచేస్తోందని ఎఐఐబి అధ్యక్షుడు జిన్ లీఖన్ పేర్కొన్నారు. అత్యవసరంగా పారిస్ ఒప్పంద లక్ష్యాలను నెరవేర్చడానికి అనుసరించాల్సిన స్పష్టమైన పంథాపై ఒక అంగీకారానికి వచ్చేలా అంతర్జాతీయ సమాజం కృషి కొనసాగించాలని కోరారు.