Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మార్స్ గ్రహంపై రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ఈనెల 18న ప్రకంపనలు సంభవించాయని నాసా తాజాగా పేర్కొంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై ఈ ప్రకంపనలను గుర్తించింది. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారి. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అని నాసా తెలిపింది. అంతేకాదు ఇన్సైట్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి 8,500 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అంత దూరంలో వచ్చిన ప్రకంపనలను ఇన్సైట్ గుర్తించడం ఇదే తొలిసారి. 2018, మార్చిలో మార్స్‌పై దిగిన ఈ ఇన్సైట్ ల్యాండర్ ఇప్పుడు భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో ఉంది. సాధారణంగా రాత్రి పూట, గాలులు తక్కువగా ఉన్న సమయంలో ఇన్‌సైట్‌లోని సీస్మోమీటర్ ఈ మార్స్ ప్రకంపనలను గుర్తించేది... అయితే ఈసారి మాత్రం పగటి సమయంలోనే రికార్డ్ చేసింది.