Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్తతల తగ్గింపునకు అంగీకారం
పారిస్ : ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములు విక్రయంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌లు మొదటిసారిగా బుధవారం మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఫోన్‌కాల్ అనంతరం సంయుక్త ప్రకటన చేస్తూ, విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మరింత కూలంకషంగా చర్చలు జరిపే క్రమాన్ని ఆరంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అక్టోబరు చివరిలో యూరప్‌లో సమావేశం కావాలని కూడా భావించారు. ఫ్రాన్స్ ఆగ్రహాన్ని అమెరికా గుర్తించినట్లుగా వైట్‌హౌస్ నుండి ఒక ప్రకటన వెలువడింది. ఫ్రాన్స్, మా యురోపియన్ భాగస్వాములకు వ్యూహాత్మక ఆసక్తి గల విషయాలపై మిత్ర పక్షాల మధ్య బహిరంగ సంప్రదింపుల ద్వారా ప్రయోజనం పొందవచ్చుని ఆ ప్రకటన పేర్కొంది. నాటో మిలటరీ కూటమికి అనుబంధంగా పటిష్టమైన యురోపియన్ కూటమి వుండాల్సిన అవసరానిన అమెరికా గుర్తించిందని కూడా ఆ ప్రకటన తెలిపింది. గత వారం దౌత్యపరమైన నిరసన తెలియచేసేందుకు వెనక్కి పిలిపించిన ఫ్రాన్స్ రాయబారిని మళ్ళీ వాషింగ్టన్కు పంపేందుకు మాక్రాన్ అంగీకరించారు..