Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూనిస్ : ట్యునీషియాలో రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్త ఆందోళనకు దారితీస్తోంది. అధ్యక్షుడు కైస్ సయిద్ ఉత్తర్వులను నిరసిస్తూ... వందలాది మంది దేశ రాజధాని టూనిస్లో ఆందోళన చేపట్టారు. రెండు నెలల క్రితం తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంతో పాటు పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను నిరసిస్తూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. పార్లమెంట్ అధికారాలపై సస్పెన్షన్ కొనసాగుతుండటం, సభ్యుల అధికారాలను నిలిపివేయడంతో పాటు వారి జీతాలను ఆపివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. జులైలో ఎమర్జెన్సీ పేరుతో అధ్యక్షుడు కైస్ సయిద్ దేశ ప్రధానిని తొలగించడం, పార్లమెంట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కైస్ విమర్శకులు ఈ సంక్షోభాన్ని సైనిక తిరుగుబాటుగా పేర్కొంటున్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, పార్లమెంట్‌ను పునరుద్ధరించాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడు సయిద్ మద్దతుదారులు కూడా ఆందోళన చేపట్టారు. సుమారు 100కి పైగా ఎన్నాహ్‌ద పార్టీ అధికారులు తమ రాజీనామాలను సమర్పించారు.