Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్‌డిపి పక్ష నేతగా ఎన్నిక
టోక్యో : జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిదా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం నాడిక్కడ జరిగిన పాలక లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎల్‌డిపి) అధ్యక్ష ఎన్నికల్లో వ్యాక్సినేషన్ మంత్రి తారో కొనోతో తలపడి విజయం సాధించారు. దీంతో వచ్చే వారం ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న యోషిహిడే సుగా వారసుడిగా కిషిదా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని సుగా గత సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అయితే కరోనాను ఎదుర్కోవడంలోను, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలోను ఘోరంగా విఫలమయ్యారు. దీనిపై సొంత పార్టీలో సైతం విమర్శలు రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.