Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : నేపాల్ తమ దేశ జనగణనలో తొలిసారిగా థర్డ్ జెండర్ కేటగిరీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ద్వారా తమకు మరిన్ని హక్కులు వస్తాయని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశిస్తోంది. నేపాల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌కు చెందిన అధికారులు శనివారం నుంచి ఇంటింటికి తిరుగుతూ జనగణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు మేల్ (పురుషులు, ఫిమేల్ (స్త్రీలు)తో పాటు ఇతరులు (థర్డ్ జెండర్) కేటగిరీ ఆప్షన్లు ఇస్తున్నారు. దేశంలో ఎల్జీబీటీక్యూకి చెందిన వారు దాఆపు 9 లక్షల మంది వరకు ఉన్నారని.. ప్రధానంగా వీరంతా ఉద్యోగాలు, విద్య, వైద్యం, తదితర అంశాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారని హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. సరైన సమాచారం లేనందువలన ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన లబ్ధి పొందలేకపోతున్నారని ఎల్జిబిటిక్యూ కార్యకర్తలు తెలిపారు.
జనగణన తర్వాత ఒక డేటా వస్తుందని, జనాభాలో తమ నిష్పత్తి ప్రకారం డిమాండ్లు చేస్తామని బ్లూ డైమండ్ సొసైటీ అనే ఎల్జీబీటీక్యూ హక్కుల గ్రూపు అధ్యక్షుడు పింకి గురుంగ్ అన్నారు. స్వలింగ సంపర్కం, లింగమార్పిడి హక్కులపై నేపాల్ ఇప్పటికే దక్షిణాసియాలో అత్యంత ప్రగతిశీల చట్టాలను కలిగి ఉంది. 2007 లో ఆమోదించిన సంస్కరణలు లింగ లేదా లైంగిక పరమైన వివక్ష ధోరణులను నిషేధించాయి. పౌరసత్వ పత్రాల కోసం నేపాల్ థర్డ్ జెండర్ కేటగిరీని 2013లో ప్రవేశపెట్టింది. దీనికి రెండు సంవత్సరాల తరువాత అధర్స్ (ఇతరులు) కేటగిరీ కింద పాస్‌పోర్టులను జారీచేయడం ప్రారంభించారు.