Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంకలో ఆరోగ్య రంగ ఉద్యోగులు సమ్మె జరిపారు. గత మూడు నెలలుగా ఇస్తున్న మహమ్మారికి సంబంధించిన నెలవారీ భత్యాన్ని (రూ. 7,500) నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఐదు గంటల పాటు సమ్మె నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1000కు పైగా ఆస్పత్రులకు చెందిన సుమారు 90 వేల మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. అలాగే కొవిడ్19 కారణంగా అధిక పని ఒత్తిడికి ప్రత్యేక సెలవు, తమ పనిస్థానం నుంచి సురక్షిత రవాణా, సరైన పీపీఈ కిట్లు ఇవ్వాలని కూడా ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేశారు. కాగా, ఇదే అంశాలతో ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఆందోళన జరిపారు.