Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : లాటిన్ అమెరికా దేశాల్లో వ్యాక్సినేషన్లో క్యూబా మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ఉరుగ్వే, చిలీ ఉన్నాయి. క్యూబాలో ఇప్పటి వరకు 80.0 శాతం మంది ప్రజలు కనీసం ఒక డోసు తీసుకున్నారు. దేశంలో అర్హులైన 1,11,80,000 వారిలో ఈనెల 26వ తేదీ నాటికి 90,48,689 మంది సొబెరేనా 02, సొబెరేనా లేదా అబ్దాలా వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని క్యూబా ప్రజారోగ్య గణాంకాలు వెల్లడించాయి. వీరిలో రెండో కూడా తీసుకున్న వారి సంఖ్య 62,93,860 (56.3 శాతం)గా, మూడో డోసు కూడా పూర్తిచేసుకున్న వారి సంఖ్య 49,55,621 (44.3)గా ఉంది. చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించిన దేశంగా ప్రపంచంలోనే క్యూబా మొదటిగా ఉంది. దేశంలో 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో ఇప్పటి వరకు 18 లక్షల డోసులు అందించారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న 19 ఏండ్లు పైనున్న వారికి సొబెరేనా ప్లస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సీఈసీఎంఈడీ గురువారం నుంచి అత్యవసర అనుమతి మంజూరు చేసింది.