Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 116కు చేరిన మృతులు
క్విటో : ఈక్వెడార్‌లోని గ్వయాక్విల్ జైలులో మంగళవారం జరిగిన ఘర్షణల్లో 116 మంది ఖైదీలు మరణించడంతో దేశంలో జైళ్ల అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షులు గౌల్లెర్నె లాస్సో ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితితో జైళ్లలో పోలీసులను, సైనికులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మంగళవారం ఘటనలో తుపాకులు, బాంబులతో ఖైదీలు ఘర్షణకు దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 80 మంది వరకూ గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఐదుగురి వరకూ తలలు నరికివేయబడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈక్వెడార్ చరిత్రలోనే ఇది అతిపెద్ద జైలు రక్తపాతంగా అధికారులు భావిస్తున్నారు. బుధవారం అత్యవవసర పరిస్థితి విధించిన తరువాత అధ్యక్షులు లాస్సో మీడియాతో మాట్లాడుతూ జైలు ఘర్షణ చెడ్డది, విచారకరమని అన్నారు. పరిస్థితి అధికారుల నియంత్రణలోకి వచ్చినట్లు కూడా చెప్పలేనని తెలిపారు.