Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూటీఓ ఆర్థికవేత్త వ్యాఖ్యలు
బీజింగ్ : కోవిడ్ సంక్షోభ సమయంలో యావత్ ప్రపంచానికి అభివృద్ధి చోదక శక్తిగా చైనా పనిచేసిందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సీనియర్ ఆర్థికవేత్త పేర్కొన్నారు. కాగా, తీవ్రమైన ఆర్థిక మాంద్యం అనంతరం ప్రపంచ వాణిజ్యం నెమ్మదిగా కోలుకుంటోందని డబ్ల్యూటీఓ గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2016 జులైలో మొదటిసారిగా గ్లోబల్ గూడ్స్ ట్రేడ్ బారోమీటర్ను ప్రవేశపెట్టినతర్వాత అత్యధికంగా, రికార్డు స్థాయిలో 110.4 పాయింట్లు నమోదు చేసినట్టు డబ్ల్యూటీఓ తెలిపింది. 'కరోనా సమయంలో వస్తువుల వాణిజ్యమనేది ఒక్కసారిగా పెరిగింది. చైనా వంటి దేశాలు కీలకమైన వస్తువులను, వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేశాయని' డబ్ల్యూటీఓ సీనియర్ ఆర్థికవేత్త కోల్మన్ నీ జిన్హువాకు తెలిపారు. కీలకమైన వస్తువులతో పాటుగా 32వేల కోట్ల మాస్కులను, 390కోట్ల పీపీఈ కిట్లను, 560కోట్ల యాసిడ్ టెస్టింగ్ కిట్లను చైనా అంతర్జాతీయంగా సరఫరా చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాణిజ్య విలువ 2020లో 5.3శాతం తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 8శాతం పెరుగుతుందని మార్చిలో డబ్ల్యూటీఓ అంచనా వేసింది.