Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : క్యూబా ప్రభుత్వంపై దాడి చేసేందుకు పలువురు జర్నలిస్టులకు అమెరికా ఫండింగ్ చేస్తోందని క్యూబాకు చెందిన స్థానిక పత్రిక 'గ్రాన్మా' తాజాగా ఒక సంచలన కథనంలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి లాటిన్ అమెరికాలో కొన్ని సంస్థలతో కూడిన ఒక నెట్వర్క్ పనిచేస్తోందని, ఇది అమెరికా సంస్థ నుంచి వచ్చిన నిధులతో వ్యతిరేక కథనాల ద్వారా క్యూబా ప్రభుత్వంపై దాడి చేసే ఉద్దేశంతో రిపోర్టర్లకు శిక్షణ ఇస్తోందని పేర్కొంది. ఎల్ ఇస్లోముడో, పెరియోడిస్మో డి బరియో, క్యూబా పాజిబుల్ అనే పబ్లికేషన్లకు చెందిన జర్నలిస్టులకు శిక్షణ కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లకు చెందిన ఫ్రంట్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఇడి)కి ద్వారా పలు ఎజిఓలకు నిధులు వెళ్తున్నాయని తెలిపింది. ఇందులో భాగంగా అర్జెంటీనా కేంద్రంగా పనిచేసే క్రోనోస్ సివిల్ అసోసియేషన్‌కు ఎన్‌ఇడి నుంచి గతేడాది 80 వేల డాలర్ల మేర నిధులు వచ్చాయని గ్రాన్మా తన కథనంలో పేర్కొంది. ఈ ఆర్గనైజేషన్‌కు చెందిన రెవిస్టా అన్ఫిబియా, కొసెచా రోజా అనే రెండు మీడియా సంస్థలు క్యూబాకు చెందిన జర్నలిస్టులకు శిక్షణ ప్రాజెక్టులు నిర్వహించడంతో పాటు స్కాలర్షిప్లు ఇచ్చింది. పెరూలో ఉన్న ఇనిస్టిట్యూట్ ప్రెన్సా వై సోసిడాడ్ (ఐపివైఎస్) కూడా గతేడాది 70,523 డాలర్లు పొందింది. వీటి ద్వారా క్యూబన్ ఇండిపెండెంట్ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం, ఈ ప్రాంతంలో కమ్యూనికేషన్ నిపుణులతో లింక్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రోగ్రామ్‌లను అభివద్ధి చేసింది. ఆ తరువత క్రోనోస్, ఐపివైఎస్లు ఓపెస్ సోసైటీ ఫౌండేషన్ల నుంచి నిధులు పొందాయని అర్జెంటీనా క్లబ్ ఆఫ్ జర్నలిస్ట్సు ఫ్రెండ్స్ ఆఫ్ క్యూబా నివేదిక పేర్కొంది. అదేవిధంగా చిలీ కేంద్రంగా పనిచేసే పబ్లిక్ స్పేస్ ఫౌండేషన్ 2019, 2020 మధ్యలో చేపట్టిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్ క్యూబా అనే ప్రాజెక్టు కూడా ఎన్‌ఇడి నిధులతో నడిచింది.