Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : కరోనా నియంత్రణకు 'కుర్మెరిక్' అనే సహజ ఔషధాన్ని అభివృద్ధి చేసిన్నట్టు క్యూబా అధికారులు శనివారం వెల్లడించారు. యాంటీ బాక్టీరియల్‌గా నిరూపితమైన ఈ ఔషధాన్ని ప్రయోగ పరీక్షల్లో భాగంగా సెంట్రల్ ప్రావిన్స్‌లోని సియగో డిఅవిలా మున్సిపాలిటీలో అనుమానిత రోగులు, కరోనా రోగులతో సంబంధం ఉన్న వారికి అందించడం ప్రారంభమైంది. థెరాగ్నోస్టిక్ లాబొరేటరీ, నేషనల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ హెడ్ తానియా వాల్డెస్ మాట్లాడుతూ ఔషధ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు తరువాత ఫ్లోరెన్సియా, చంబాస్, సిరో రెడోండో మున్సిపాలిటీల్లో కూడా పరీక్షలు చేస్తామని చెప్పారు. ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన ఈ కుర్మెరిక్ ఔషధం కుర్కుమా లోంగా సారాన్ని కలిగి ఉండడంతో పాటు దాని ప్రయోజనాలను గుర్తించేందుకు ఉన్నతస్థాయి సాంకేతికతను వినియోగించారు. దీని భద్రత నిరూపితమవడంతో పాటు సార్స్-కోవ్-2 ఉపజాతికి చెందిన బోవిన్ కరోనా వైరసుకు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ ప్రభావాలను కలిగి ఉందని స్థానిక గ్రాన్మా డైలీ నివేదించింది. నోరు లేదా ముక్కు ద్వారా అందించే ఈ కుర్మరిక్ ఫలితాలు ఒకటి లేదా రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.