Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిషి మనుగడలో వేడి, చలి, స్పర్శలపై పరిశోధన
- ఆర్డెమ్, డెవిడ్ జూలియన్లను వరించిన పురస్కారం
వాషింగ్టన్: వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ఇద్దరు పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. డాక్టర్ డేవిడ్ జూలియస్, డాక్టర్ ఆర్డెమ్ పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి వరించింది. శరీరం ఎందుకు వేడెక్కెతుంది? స్పర్శలో తేడాలపై పరిశోధనలు.. మొత్తంగా కౌగిలింత అనుభూతి రహస్యాలను కనుగొన్నం దుకు వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. ''మనిషి మనుగడలో వేడి, చలి, స్పర్శలను గ్రహించే మన సామర్థ్యం చాలా అవసరం. పైగా ఈ చర్యలు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన పరస్పర చర్యను బలపరుస్తుంది. దైనందిన జీవితంలో మనం ఈ అనుభూతులను తేలికగా తీసుకుంటాము. అయితే ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాల ప్రేరణలు ఎలా మొదలవుతాయి అనే ప్రశ్నను పరిష్కరించిందినం దుకు గాను ఈ సంవత్సరం డాక్టర్ డేవిడ్ జూలియస్, డాక్టర్ ఆర్డెమ్ పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించాం'' అని నోబెల్ అసెంబ్లీ వెల్లడించింది. కాగా, డేవిడ్ జూలియస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మరో శాస్త్రవేత్త ఆర్డెమ్ పటాపౌటియన్ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్ రీసెర్చ్‌లో కేంద్రంలో ప్రొఫెసర్‌గా కొనసాగు తున్నారు. వీరిద్దరూ కూడా అమెరికన్ పౌరులు కావడం విశేషం.