Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బృహత్తర ప్రణాళికలను వెల్లడించిన బిడెన్
హావెల్ (అమెరికా): బృహత్తరమైన తన సామాజిక వ్యయ ప్రణాళికల గురించి అందరికీ చెప్పి మద్దతు పొందేలా చూసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధత, అయోమయాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఆయన మిచిగన్‌లో పర్యటిస్తున్నారు. ప్రజలకు తన ప్రతిపాదనల గురించి మరింత వివరంగా చెప్పాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా మరోవైపు వాషింగ్టన్లో వ్యయ బిల్లులపై చర్చలు కొనసాగుతున్నాయి. భద్రతా వ్యవస్థను విస్తరించడం, ఆరోగ్య, పర్యావరణ కార్యక్రమాలను పెంపొందించడం వంటివి బిడెన్ ఎజెండాలో వున్నాయి.
అమెరికా క్షీణతను నివారించడానికి కీలకమైన బృహత్తర ప్రణాళికలను అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. బృహత్తరమైన సామాజిక వ్యయం ప్రతిపాదన అనేది అంతర్జాతీయంగా అమెరికా పోటీతత్వానికి చాలా కీలకమైనదని బిడెన్ వ్యాఖ్యానించారు. తన ప్రణాళికలను వ్యతిరేకించే వారిని 'అమెరికా క్షీణతలో భాగస్వామి' గా ఆయన అభివర్ణించారు. గత కొంత కాలంగా తనకున్న ఆలోచనలు, ప్రణాళికలను బిడెన్ చాలా వివరంగా పంచుకున్నారు. గత వారం రోజులుగా ఆయన తన ప్రతిపాదనలపై తీవ్రంగా చర్చలు జరిపారు. బాలల విద్యకు నిధులు అందించడం, వాతావరణ మార్పులపై పోరు సల్పేందుకు పెట్టుబడులతో సహా తన ప్రణాళికల గురించి ఆయన వివరించారు. అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచడానికి ఈ ప్యాకేజీ బాగా దోహదపడుతుందని బిడెన్ పేర్కొన్నారు.