Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుఖారెస్ట్: రుమేనియాలో లిబరల్ ప్రధాని ఫ్లోరిన్ సిటు నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. మంగళవారం పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సిటు ప్రభుత్వం రాజీనామా చేసింది. దీంతో రుమేనియా మరోసారి రాజకీయ అనిశ్చితిలోకి జారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ (పీఎస్డీ) ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా, 467 స్థానాలున్న పార్లమెంటులో 281 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. అధికార పార్టీ, దాని మిత్ర పక్షాలు ఓటింగ్‌ను బహిష్కరించడంతో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా రాలేదు. పడలేదు. పాలక నేషనల్ లిబరల్ పార్టీ (పీఎన్ఎల్) అధ్యక్షుడిగా సిటు ఎన్నికైన పది రోజులకే ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. మాజీ బ్యాంకర్ అయిన సిటు(49) గత ఏడాది డిసెంబరు 23న అధికారం చేపట్టారు. ఆయన ప్రభుత్వానికి మధ్యేవాద మితవాద భాగస్వామ్యపార్టీ గత నెల తన మద్దతు ఉపసంహరించుకుంది. సీటు నిరంకుశ పోకడలు రోజురోజూకీ పెరిగిపోతున్నందునే తాము బయటకు వచ్చేశామని ఆ పార్టీ తెలిపింది.
ప్రస్తుత ప్రతిష్ఠంభన తొలగాలంటే సత్వర ఎన్నికలు నిర్వహించడమొక్కటే మార్గమని పీపిఎస్డీ నేత మార్సెల్ సియోలాక్ తెలిపారు.