Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్యూరిచ్ : ఈ ఏడాది చివరిలోగా అమెరికా, చైనా అధ్యక్షులు ఆన్లైన్లో సమావేశం కావడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ సంబంధాల మెరుగుదల కోసం ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం అమెరికా సీనియర్ అధికారి ఒకరు బుధవారం నాడు మీడియాకు ఈ విషయం వెల్లడించారు. స్విస్ నగరమైన జ్యూరిచ్ విమానాశ్రయంలోని హౌటల్లో గోప్యంగా జరిపిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్, చైనా దౌత్యవేత్త యాంగ్ జియిచి ముఖాముఖి చర్చలు జరిపారు. గత మార్చిలో అలాస్కా సమావేశంలో అసాధారణ రీతిలో పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్న తరువాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ విధంగా ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇటలీలో అక్టోబరులో జరిగే జి-20 సదస్సు సందర్భంగా ఇరు దేశాల అధినేతలు కలుసుకునే అవకాశం వచ్చినప్పటికీ, కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి హాజరు కాలేనని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సెప్టెంబరు 9న బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఫోన్ చేశారని, ఆ తర్వాత ఈ సమావేశం జరిగిందని అమెరికా అధికారులు తెలిపారు.
దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలు, హాంకాంగ్, షింజియాంగ్, తైవాన్ పట్ల చైనా వైఖరి, మానవ హక్కులు వంటి అంశాలను సుల్లివన్ లేవనెత్తినట్లు వైట్‌హౌస్ తెలిపింది. దాదాపు ఆరుగంటల పాటు ఈ చర్చలు సాగాయి. ఇవి నిర్మాణాత్మకంగా, అర్ధవంతంగా జరిగాయని ఆయన అన్నారు.ఘర్షణ వైఖరి వల్ల ఇరు దేశాలు, ప్రపంచం కూడా దెబ్బ తింటుందని సులివన్ స్పష్టం చేసినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఒ క ప్రకటనలో తెలిపింది.