Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరణార్ధుల కన్నీటికష్టాల రచనకు పురస్కారం
స్టాక్‌హౌమ్: 2021 ఏడాదికి గానూ సాహిత్యంలో అబ్దుల్ రజా క్ గుర్నాను నోబెల్ బహుమతి వరించింది. బ్రిటీష్ పాలకుల వల్ల కలిగిన వలసవాదం ప్రభావాల ను, గల్ఫ్‌లో విభిన్న పరిస్థితుల మధ్య నలిగిన శరణార్థుల దీనావ స్థలను అబ్దుల్ రజాక్ తన రచనా శైలిలో కండ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఈ ఏడాదిలో సాహిత్యంలో గుర్నాకు నోబెల్‌ను అందిస్తున్నట్టు గురువారం రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది.''గుర్నా సాహిత్యం నిరంతరం దశలు మారుతూనే ఉంటుం ది.ఆయన రచనల్లో జ్ఞాపకాలు,పేర్లు, గుర్తులు నిత్యం మారుతూనే ఉంటాయి.ఆయన పుస్తకాల్లో అంతం లేని విజ్ఞానాన్వేషణ ఉంటుంది'' అంటూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2020లో రాసిన ఆఫ్టర్లైవ్స్ నవలలోనూ అబ్దుల్‌రజాక్ రచనా ప్రావీణ్యం ఏమాత్రం తగ్గలేదని వెల్లడించింది. సత్యానికి గుర్నా కట్టుబడి ఉన్న తీరు అద్భుమనీ, మూసధోరణికి స్వస్తిపలికిన ఆయన.. తన రచనలతో ఆఫ్రికా సాంస్కృతి వైరుధ్యాలను అనర్గళంగా చెప్పినట్టు అకాడమీ అభిప్రాయపడి ంది.కాగా,గుర్నా జాంజీబర్ దీవుల్లో 1948లో జన్మించారు. 1960దశకం లో ఓ శరణార్థిగా ఆయన ఇంగ్లండ్ చేరుకున్నారు. క్యాంట్‌బెరీలోని కెంట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలు అందించి.ఇటీవలే రిటైర్ అయ్యారు.ఆయన మొత్తం పది నవలను రాశారు. ఇంకా ఎన్నో చిన్న కథలను పబ్లిష్ చేశారు.ఓ శరణార్థి ఎలా నలిగిపోయాడో తన రచనాశైలి తో ఆకట్టుకున్నారు.21ఏండ్ల నుంచి ఆయన రైటింగ్ ప్రారంభించారు. 1994లోప్యారడైజ్ అనే నాల్గో నవలతో ఆయన గుర్తింపు లభించింది. 1990లో ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన ఆయన అందులో ప్రయాణ వివరాలు రాశారు.భిóన్నమైన విశ్వాసం కలిగిన వ్యక్తుల ఓ విషాద ప్రేమకథను చెప్పారు.శరణార్థి అనుభవాలను తన నవల్లో గుర్నా అద్భుతంగా ఆవిష్కరించారు.