Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్య సాధనకు వ్యూహం : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : ఈ ఏడాది ఆఖరుకు ప్రతి దేశంలో 40 శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ పూర్తయ్యేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవ తీసుకుంటుందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో అల్పాదాయ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యతనిస్తూ 2022 మధ్యకు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు డబ్ల్యుహెచ్ఒ ఒక వ్యూహాన్ని ప్రారంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో టెడ్రోస్ అథనోమ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరుకు, వచ్చే ఏడాది మధ్యకు పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలంటే కనీసంగా 1,100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం అవుతాయని అన్నారు. అయితే ఇక్కడ సరఫరా సమస్యకు బదులుగా కేటాయింపు సమస్య నెలకొందని పేర్కొన్నారు.