Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా : పెరూ ప్రధాని గెయిడొ బెలిడొ రాజీనామా చేసినటుట అధ్యక్షుడు పెడ్రో కేస్టిలో ప్రకటించారు. జులై 29న బెలిడొ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ ఉద్రిక్తతల్లో చిక్కుకున్న దేశ పరిపాలనను కాపాడేందుకు ఆయన రాజీనామా చేశారని తెలిపారు. దేశానికి మంత్రిమండలి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రధాని రాజీనామాను ఆమోదించినట్టు అధ్యక్షుడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలిపారు. విదేశాంగ మంత్రి ఆస్కార్ మార్తువాతో బహిరంగంగా ఘర్షణ పడడం, మంత్రివర్గంలో తీవ్ర విభేదాలు, అస్తవ్యస్థ పరిస్థితులు కారణంగా బెలిడొ రాజీనామా వెలువడిందని దినపత్రిక 'ఎల్ కమర్షియో' తెలిపారు. ప్రభుత్వంలో సమగ్రతను కాపాడేందుకు రాజీనామాను ఆమోదించినట్టు అధ్యక్షుడు తెలిపారు..