Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ : పాకిస్తాన్ అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన అణు భౌతిక శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (85) ఆదివారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ను తెల్లవారు సమయంలో స్థానిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉదయం 7 గంటలకు మరణించినట్టు కెఆర్ఎల్ హాస్పిటల్ వెల్లడించింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కారణంగా పనిచేయడం ఆగిపోడంతో కాపాడలేకపోయామని వైద్యులు పేర్కొన్నారు. ఖాన్ అంతకుముందు కోవిడ్-19 బారిన పడటంతో ఆగస్టు 26న కెఆర్ఎల్ ఆసుపత్రికి, ఆ తరువాత రావల్పిండిలోని మిలటరీ హాస్పిటల్లో చికిత్స అందించారు. ఉత్తరకొరియా, ఇరాన్, లిబియా దేశాలకు అణురహస్యాల అమ్మకం కుంభకోణంలో ఖాన్ కేంద్ర బిందువుగా ఉన్నారు. 2004లో జరిగిన ఈ విషయంలో తన ప్రమేయం ఉందని ఆయన స్వయంగా టెలివిజన్ ద్వారా ఒప్పుకోవడంతో అప్పటి అధ్యక్షులు పర్వేజ్ ముషారఫ్ క్షమాభిక్ష పెట్టారు. ఖాన్ కొన్ని సంవత్సరాల పాటు అధికారిక గృహ నిర్బంధ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అధికారులకు తెలియకుండా తాను వ్యవహరించానని అంగీకరించిన అబ్దుల్ ఖాన్, ఆ తరువాత తనను బలిపశువును చేశారని చెప్పారు. కాగా, ఖాన్ మృతికి పాక్ అధ్యక్షులు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరిఫ్ అల్వి సంతాపం వ్యక్తం చేశారు.