Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : కోవిడ్-19 వైరస్‌పై పోరులో భాగంగా క్యూబా ప్రభుత్వం పెద్దయెత్తున చేపట్టిన సామూహిక టీకాల కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోందని విదేశాంగ మంత్రి బ్రునో రోడ్రిగుడ్జ్ శనివారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. క్యూబా శాస్త్రవేత్తలు, ఫార్మా ఇండిస్టీ అభివృద్ధి చేసిన సొంత రెండు టీకాలతో దేశంలో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సాగుతోందని అన్నారు. నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు దేశజనాభాలో 85.6 శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందగా, ఇది వ్యాక్సిన్ అర్హులైన వారిలో 97.8 శాతంగా ఉంది. మొత్తం మీద వీరిలో 59.7 శాతం మంది పూర్తి డోసులు పూర్తి చేసుకున్నారని రోడ్రిగుజ్ వెల్లడించారు. దేశంలో భారీస్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా పలు క్యూబన్ ప్రావిన్స్‌లో వాణిజ్య, ఇతర కార్యకలాపాలు క్రమంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో విధించిన అంక్షలను కూడా అధికారులు సడలిస్తున్నారు.