Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ సమాజానికి తాలిబన్ల విజ్ఞప్తి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు నెరపాలంటూ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అయితే మహిళల విద్యపై స్పష్టమైన హామీలివ్వడానికి వెనుకాడారు. దీనిపై తమకు మరికొంత సమయం కావాలని కోరారు. ఆఫ్ఘన్ చిన్నారులందర తిరిగి పాఠశాలలకు వెళ్ళేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయంగా డిమాండ్లు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే యత్నంలో భాగంగా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి తాలిబన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ''అంతర్జాతీయ సమాజం మాతో సహకరించాలి.'' అని విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాక్వి కోరారు. ''దీంతో అభద్రతా భావాన్ని మేం నిలువరించగలుగుతాం. అదే సమయంలో ప్రపంచ దేశాలతో సానుకూలంగా వ్యవహరించగలుగుతాం'' అని అన్నారు. దోహాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బాలికలు తిరిగి హైస్కూల్‌కు వెళ్ళడానికి అనుమతించేందుకు తాలిబన్ ఇప్పటివరకు తిరస్కరిస్తూ వస్తోంది. 'అంతర్జాతీయ సమాజం 20ఏండ్ల కాలంలో అమలు చేయలేని సంస్కరణలను మేం పూర్తి చేయాలనుకోవడం సరికాదు, మేం అధికారంలోకి వచ్చి కొద్ది వారాలే అయింది.'' అని ముత్తాక్వి తెలిపారు. 'ప్రపంచ దేశాలకు చాలా ఆర్థిక వనరులు వున్నాయి, పటిష్టమైన అంతర్జాతీయ మద్దతు వుంది. కానీ రెండు మాసాల్లో అన్ని సంస్కరణలు పూర్తి చేసేయాలంటూ మీరు డిమాండ్ చేస్తున్నారు.' అని ఆయన అన్నారు. ఒత్తిడి తీసుకురావడానికి బదులుగా, ప్రపంచం మాతో సహకరించాలని కోరారు.