Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించిన ఐరాస చీఫ్
ఐక్యరాజ్య సమితి : ఆఫ్ఘన్ మహిళలకు, బాలికలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ తాలిబన్లను విమర్శించారు. ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలకుండా వుండేందుకు గానూ మరింత మొత్తాలను విరాళంగా అందచేయాల్సిందిగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఈ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళల హక్కుల అంశం లేవనెత్తినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుటెరస్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయన, అంతర్జాతీయ మానవ హక్కులు, మానవతా చట్టం కింద తమ విధులను, కర్తవ్యాలను తాలిబన్లు నెరవేర్చాలని గుటెరస్ కోరారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వదలబోదని స్పష్టం చేశారు. రోజూ తాలిబన్లతో దీనిపై చర్చిస్తుందని చెప్పారు. చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆఫ్ఘన్ మహిళల కలలు ఛిద్రమవుతాయని అన్నారు. ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళపై కూడా ఆయన మాట్లాడారు. విదేశాల్లోని ఆస్తులు స్తంభింపచేశారనీ, అభివృద్ధి సహాయం నిలిపివేయబడిందని అన్నారు.