Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కున్మింగ్ : జీవ వైవిధ్యంపై నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ టూ ది కన్వెన్షన్(సిఒప 15)లో బుధవారం కున్మింగ్ డిక్లరేషన్‌ను ఆమోదించారు. చైనా జీవావరణ, పర్యావరణ మంత్రి హువాంగ్ రున్కియు బుధవారం నాడిక్కడ ఈ విషయం వెల్లడించారు. కున్మింగ్ 'డిక్లరేషన్ ఒక శక్తివంతమైన సంకేతాన్ని పంపుతుంది, తీవ్రంగా ముందుకొస్తున్న జీవవైవిధ్య సమస్యను పరిష్కరించాలనే మా సంకల్పాన్ని ప్రపంచానికి ఇది చాటిచెబుతుంది అని హువాంగ్ తెలిపారు.ఈ కున్మింగ్ డిక్లరేషన్ ఒక రాజకీయ డిక్లరేషన్, ఈ సదస్సు సాధించిన ముఖ్యమైన విజయంగా దీనిని పేర్కొనవచ్చు అని ఆయన అన్నారు. ప్రస్తుత జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి, 2030 నాటికి జీవవైవిధ్యం పునరుద్ధరణ సాధించడానికి, 2020 తర్వాత సమర్థవంతమైన గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అభివద్ధి, స్వీకరణ అమలును నిర్ధారించడానికి, 'ప్రకతితో సామరస్యంగా జీవించడం' అనే 2050 విజన్ సాధించడానికి ఈ డిక్లరేషన్ కట్టుబడి ఉంది అని తెలిపారు. ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనే ఐరాస బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2050 విజన్ ఆధారంగా ఈ డిక్లరేషన్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు.