Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో ఏటా లక్షమంది దాకా మృతి : తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూయార్క్ : మీరు ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారా, జాగ్రత్త. అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరిగిపోయింది. మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకోవాలన్నా, ఆహారపదార్థాలు నిల్వ చేసుకోవాలన్నా ప్లాస్టిక్ బాక్స్‌లు, డబ్బాలు వాడడం పరిపాటి. రెస్టారెంట్స్, హోటల్స్ నుంటి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ పార్శిల్స్‌లోనే ఇండ్లకు చేరుతుంటాయి. మనం నిత్యం వినియోగించే బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, షాంపూలు ఇవన్నీ మనిషిపై తెలియకుండానే తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. మరణానికి దగ్గర చేస్తున్నాయి అని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల రసాయనిక చర్యకు గురై అమెరికాలో ఏటా లక్షమంది దాకా చనిపోతున్నట్టు న్యూయార్క్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన వివరాలను పర్యావరణ కాలుష్య పత్రిక ప్రచురించింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు దీర్ఘకాలం మన్నేందుకు, మృదువుగా ఉండేందుకు థాలేట్స్ లేదా థాలలేట్ ఈస్టర్లు (థాలేట్ ఆమ్లం)ను కలుపుతుంటారు. ఈ రసాయనం మానవుల్లో అతి ముఖ్యమైన హార్మోన్ వ్యవస్థపై దాడి చేస్తుందని, దీంతో హార్మోన్ అసమతుల్యతకు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. ఈ రసాయనాలు శరీరంలోకి చేరడంతో ఊబకాయం, డయాబెటిస్, గుండె సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. 55 నుంచి 64 ఏండ్ల వయస్సు కలిగిన 5 వేల మంది వృద్ధులపై న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మస్ స్యూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం చేపట్టింది. మూత్రంలో థాలెట్ స్థాయిలు అధికంగా ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. విషపూరిత థాలెట్ను పరిమితం చేయడం అమెరికన్ల రక్షణకు సహాయపడుతుందని అన్నారు. థాలెట్స్ వల్ల ఆర్థిక నష్టం 4,000- 4,700 కోట్ల డాలర్ల దాకా ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఇది గతంలో అంచనా వేసిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని పేర్కొంది. -