Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్య సమితి : వచ్చే సంవత్సరానికి సాధారణ బడ్జెట్ కింద దాదాపు 312కోట్ల అమెరికన్ డాలర్లు కావాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ కోరారు. 'మాకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలంటే, మాకు మొత్తంగా 312 కోట్ల డాలర్లు అవసరం. అదనపు కార్యకలాపాలు, బాధ్యతలు వున్నా గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 2.8శాతం తక్కువగా వుంది' అని అన్నారు. బడ్జెట్ వ్యవహారాలను చూసే కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపాదిత బడ్జెట్లో మొత్తంగా 10,005 పోస్టులు వున్నాయి. ఇవి గతేడాది కన్నా 46 ఎక్కువ. వీటిలో 43 పోస్టులు పాలస్తీనా శరణార్ధుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి రిలీఫ్ సంస్థకే కేటాయించబడ్డాయి. ఈ సంస్థలన్నీ విద్య, ఆరోగ్య సంరక్షణ, సాధారణ సహాయం కోసం పనిచేస్తాయి. 2021 సంవత్సరం బ్రహ్మాండంగా ఆరంభమైన తర్వాత నెమ్మదిగా సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ వచ్చిందని గుటెరస్ చెప్పారు.