Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తైపే : అమెరికా అండ చూసుకుని చైనాకు వ్యతిరేకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తైవాన్ చీటికీ మాటికీ యుద్ధ ప్రస్తావనలను తీసుకొస్తున్నది. తైవాన్ రక్షణ మంత్రి గురువారం ఒక ప్రకటన చేస్తూ శత్రువును ఎదుర్కొనేందుకు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఇటీవల తైవాన్ సైన్యానికి అధునాతన ఆయుధాల వినియోగంలో అమెరికా శిక్షణ ఇస్తున్నది. దీనిపై చైనా తైవాన్ను గట్టిగా హెచ్చరించింది. అయినా, లెక్క చేయకుండా తైవాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మాతృదేశం ఒత్తిళ్లకు లొంగేది లేదని తైవాన్ నేత ప్రకటించారు. ఇప్పుడు యుద్ధ ప్రస్తావనను తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. తైవాన్ రక్షణ మంత్రి చియు కుచెంగ్ గురువారం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, తమపై దాడి జరిగితే తమని తాము కాపాడుకోగలమని అన్నారు.