Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి
బీరుట్ : లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. గత ఏడాది బీరుట్ ఓడరేవులో భయంకరంగా జరిగిన పేలుళ్ళపై దర్యాప్తు చేస్తున్న న్యాయమూర్తికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో బీరుట్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. భారీగా తుపాకీ కాల్పులు కూడా చోటు చేసుకోవడంతో ఆరుగురు మరణించారు. అశాంతిని అణచివేసేందుకు లెబనాన్ ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. జస్టిస్ ప్యాలెస్ ఏరియాలో ప్రజలు భయంతో అటునిటూ పరిగెడుతూ వుండడం కనిపిస్తోంది. వెనక సైరన్లు మోగుతూ వుండగా, పలుసార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. రోడ్డు మీద ఆయుధంతో ఎవరైనా కనిపిస్తే కాల్చివేస్తామని సైన్యం ప్రకటించింది. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల్లో ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని లెబనాన్ హోం మంత్రి ధ్రువీకరించారు. హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రధాని నజిబ్ మికాతి అధికారులను ఆదేశించారు. ఇద్దరు రాజకీయ నేతలు పెట్టిన కేసును లెబనాన్ కోర్టు తోసిపుచ్చిన వెంటనే నిరసనలు ఆరంభమయ్యాయి. ప్రధాన దర్యాప్తు అధికారి తారెక్ బిటార్ గత మూడు వారాల్లో రెండోసారి దర్యాప్తు నిలిపివేశారు.