Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైవాన్‌లో భారీ అగ్ని ప్రమాదం
- 46 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
కవోసియుంగ్ : తైవాన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. 13 అంతస్థుల భవనంలో మంటలు చెలరేగ టంతో 46మంది అగ్నికి ఆహుత య్యారు. మరో 79మంది ఆ మంటల్లోనే చిక్కు కున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో 14 మం ది పరిస్థితి విషమంగా ఉన్నదని అగ్నిమాపకశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ప్రాణం తీసిన అగ్గిమంటలు..
తెల్లవారు జామున మూడు గంటలప్రాంతంలో పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. అమాంతంగా మంటలు ఎగిసిపడేలోపు..ఆ భవనంలో ఉంటున్న వారంతా గాఢనిద్రలో ఉన్నట్టు చెబుతున్నారు. మంటలు విస్తరించేలోపు హాహాకారాలతో కొందరు బయటకు వచ్చినా.. ఎక్కువ మంది ఆ మంటల్లోనే చిక్కుకున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతంలో ఈ 13 అంతస్థుల భవనం ఉన్నది. ఇందులో కింది భాగంలో రెస్టారెంట్, సినిమా హాల్ కూడా ఉన్నది. సుమారు 40 ఏండ్ల నాటి ఈ భవనం కావటంతో..రెస్టారెంట్, సినిమా హాల్ మూసివేసి ఉన్నాయి.పై అంతస్థుల్లో నివాసముంటున్నారు. భవనంలో ఎగిసిపడ్డ మంటలు తీవ్రం కావటంతో.. ఆర్పటానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సివచ్చింది. ఈ లోపు జరగరాని అనర్థం జరిగిపోయింది. భవనంలోని ఏడు, 11 వ అంతస్తుల మధ్య ప్రజలు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపి.. భారీసంఖ్యలో ప్రాణనష్టం జరగకుండా అగ్నిమాపకశాఖ అధికారులు కాపాడే ప్రయత్నం చేశారు. కవోసియుంగ్ నగరం తైవాన్‌కు దక్షిణాన ఉన్నది. ఇది తీర పట్టణ కేంద్రం నుంచి గ్రామీణ యుషన్ రేంజ్ వరకు 2,952 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. జనాభా 2.77 మిలియన్లు. ఇది తైవాన్‌లో అత్యధిక జనాభా కలిగిన మూడవ నగరం. అంతేకాదు దక్షిణ తైవాన్‌లో కూడా అతిపెద్ద నగరం.