Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాదేశిక జలాలను ఉల్లంఘించకుండా అడ్డుకున్న రష్యా
మాస్కో : రష్యా జలాంతర్గామి విధ్వంస నౌక అమెరికా నావికా దళానికి చెందిన డిస్ట్రాయర్‌ను ట్రాక్ చేసిందని, జపాన్ సముద్రంలో రష్యా ప్రాదేశిక జలాలను ఉల్లంఘించకుండా అడ్డుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జపాన్ సముద్రంలో పలు రోజుల పాటు గడిపిన అనంతరం డిస్ట్రాయర్ యూఎస్ఎస్ చఫీ రష్యా ప్రాదేశిక జలాలను సమీపించిందని, ఆ జలాలను దాటడానికి ప్రయత్నించిందని రక్షణ శాఖకి చెందిన జవెదా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ తెలిపింది. రష్యా జలాంతర్గామి విధ్వంస నౌక అడ్మిరల్ ట్రిబ్యూట్స్ విదేశీ యుద్ధ నౌకను గుర్తించి, వెంటనే హెచ్చరికను జారీ చేసింది. అయినా, అమెరికా యుద్ధ నౌక తన దిశను మార్చుకోకపోవడంతో ప్రాదేశిక జలాల నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రష్యా యుద్ధ నౌక 60మీటర్ల సమీపానికి వచ్చి మరీ హెచ్చరించడంతో అమెరికా నౌక తన దిశను మార్చుకుని వెనక్కి తిరిగివచ్చింది. అమెరికా డిస్ట్రాయర్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించాయని, 1972నాటిఇ సోవియట్-అమెరికా ఒప్పందాన్ని కూడా అతిక్రమించాయని జవెదా తెలిపింది. ఈ విషయమై మాస్కోలోని అమెరికా ఎంబసీలలో డిఫెన్స్ అటాచిని రష్యా రక్షణ శాఖ పిలిపించి నిరసన తెలియచేసింది.