Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన పాత్రికేయ అవార్డు ప్రకటించిన యూరోపియన్ పార్లమెంట్
పారిస్: ఇజ్రాయిల్ ఎన్ఎస్వో గ్రూప్‌నకు చెందిన పెగాసస్ స్పైవేర్ కుంభకోణ విషయాలను వెలుగులోకి తెచ్చిన భారత్‌కు చెందిన దివైర్, ది గార్డియన్ సహా మొత్తం 17 మీడియా సంస్థలతో కూడిన కూటమికి యూరోపియన్ పార్లమెంట్ పాత్రికేయ రంగంలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకునే అవార్డును ప్రకటించింది. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న లాభపేక్షలేని జర్నలిజం గ్రూప్ ఫర్బిడ్డెన్ స్టోరీస్ నేతృత్వంలో 17 మీడియా సంస్థలు కలిసి పెగసస్ స్పైవేర్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చాయి. దీనికి గానూ ఈయూలోని 27 దేశాల పార్లమెంట్.. పెగాసస్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మీడియా కుటమికి ప్రముఖ 'డాఫ్ని కరుయాన గాలిజియా' అవార్డును అందించింది. పెగాసస్ స్పైవేర్‌తో ప్రపంచంలోని చాలా దేశాలు అక్కడి రాజకీయ నాయుకులు, పాత్రికేయులు, పౌరులు, సామాజిక కార్యకర్తలపై నిఘా పెట్టింది. ఇటీవల ఈ పెగాసస్ వ్యవహారం దాదాపు 50 దేశాల్లో సంచలనంగా మారడంతో పాటు ఇప్పటికీ హీట్‌ను పుట్టిస్తోంది. కాగా, కరువానా గలిజియా ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. అయితే, 2017 ఆగస్టు 16న ఆమె ఇంటి సమీపంలో జరిగిన బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. ఆమె పేరుమీదుగానే ఈ అవార్డును అందించడం ప్రారంభించారు.