Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఈ వారంలో ఆఫ్ఘనిస్తాన్పై జరిగే చర్చల్లో అమెరికా పాల్గొనబోదని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. రష్యా ఈ చర్చలకు ఆతిథ్యమివ్వనుంది. 'త్రైపాక్షిక చర్చా వేదిక అనేది చాలా సమర్ధవంతమైన, నిర్మాణాత్మకమైన ఫోరం. అందులో పాల్గొనడానికి మేం కూడా ఎదురుచూస్తున్నాం. అయితే ఈ వారంలో జరిగే చర్చల్లో పాల్గొనే పరిస్థితిలో లేమని' విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్లకు తెలిపారు. కొన్ని ఇబ్బందుల వల్ల ఈ చర్చల్లో తాము పాల్గొనలేమని, అయితే ఈ చర్చల క్రమానికి మద్దతిస్తామని ప్రైస్ తెలిపారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలకు సంబంధించి అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలీల్జద్ పదవి నుండి వైదొలగుతున్నారని, ఆయన డిప్యూటీ థామస్ వెస్ట్ ఆ స్థానంలో నియమితులవుతారని తెలిపారు.