Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టుడుకుతున్న అమెరికా !
వాషింగ్టన్ : అమెరికాలో వేలాదిమంది కార్మికులు సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. కోవిడ్ ప్రభావాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తోన్న లేబర్ మార్కెట్లో మరింత మెరుగైన పరిస్థితులు కల్పించాలని, అధిక వేతనాలు ఇవ్వాలని కోరుతూ వారు సమ్మెకు దిగారు. అమెరికా చిత్ర పరిశ్రమను కూడా స్తంభింపచేస్తామని హాలివుడ్ సిబ్బంది హెచ్చరించారు. అయితే చివరి నిముషంలో, సాంకేతిక నిపుణుల పని పరిస్థితులపై ఒక అంగీకారం కుదిరింది. కానీ మిగిలిన యూనియన్లు ఇంకా సమ్మె కొనసాగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా, వ్యవసాయ యంత్రాల ఉత్పత్తిదారైన జాన్ డెరీ భారీ యంత్రాల ఆపరేటర్లు 10వేల మందికి పైగా సమ్మెలో పాల్గొన్నారు. కాలిఫోర్నియా, ఓరెగావ్ల్లో హెల్త్ కేర్ గ్రూప్ కైసర్ పెర్మెంటెకి చెందిన 31వేల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్లు కూడా సమ్మెకు దిగాయి. ఈ నెల ప్రారంభం నుండి న్యూయార్క్‌లోని మెర్సి ఆస్పత్రికి చెందిన 2వేల మందికి పైగా సిబ్బంది, కెలోగ్ సెరెల్ కంపెనీకి చెందిన 1400మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి తోడు మియామి, చికాగో, డల్లాస్ విమానాశ్రయాల్లో రెండు వారాల పాటు పికెట్లు నిర్వహించాలని అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలట్లు యోచిస్తున్నారు. అల్బామాలో వెయ్యి మంది బొగ్గు గని కార్మికులు, మసాచుసెట్స్‌లో 700మంది నర్సులు, కెంటకీలో 400మంది విస్కీ తయారీదారులు, నెవడాలో 200మంది బస్సు డ్రైవర్లు అందరూ కూడా వారి విధులను బహిష్కరించారని మీడియా తెలిపింది.