Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవత్వాన్ని బోల్సనారో కించపర్చారు : సెనెట్ కమిషన్
బ్రసీలియా : బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సనారో మానవత్వాన్ని కించపరిచే నేరాలకు పాల్పడినట్టు సెనెట్ కమిషన్ పేర్కొంది. ఆరోగ్య చర్యల ఉల్లంఘన, ప్రభుత్వ పత్రాలకు నకిలీలు సృష్టించడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం, అధ్యక్షుని హౌదాకు వ్యతిరేకంగా దాడులు నిర్వహించడం వంటి ఆరోపణలను బోల్సనారో ఎదుర్కొంటున్నారు. కోవిడ్ మహమ్మారిని బోల్సనారో ప్రభు త్వం ఎదుర్కొన్న తీరుపై సెనెట్ కమిషన్ విచారిస్తోంది. అధ్యక్షుడు మానవత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారించింది. శాస్త్రీయ విరుద్ధమైన ధోరణితో వ్యవహరిం చారనీ, ప్రతీదాన్ని తిరస్కరించే వైఖరితో వున్నారని పేర్కొంది. బ్రెజిల్లో ఇప్పటివరకు కరోనాతో 6లక్షల మందికి పైగా మరణించారు. మితవాద అధ్యక్షుడితో పాటు ఆరోగ్య, రక్షణ మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కంప్ట్రోలర్, మాజీ విదేశాంగ మంత్రి సహా మరో 50మంది పేర్లను కమిషన్ ప్రస్తావించింది. అధ్యక్షుడిపై పై అభియోగాలను మోపడంతో పాటుగా, శాస్త్రీయ సామర్ధ్యం నిరూపితం కాని మందులను ఉపయోగించాలంటూ దేశ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తీసుకువచ్చారని కమిషన్ పేర్కొంది. పైగా వ్యాక్సిన్ల సమీకరణ క్రమంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. కరోనా గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు బోల్సనారో ప్రభుత్వం, మితవాద కార్యకర్తలతో కుమ్మక్కైనట్లుకూడా సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఇలా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసిన వారి లో బోల్సనారో కుమారులు వున్నారు. క్లోరోక్విన్‌ను ఉపయో గించి 'ఎర్లీ ట్రీట్మెంట్' ఇవ్వాలంటూ పట్టుబట్టారనీ, అదే ఈ మహమ్మారిని ఎదుర్కొనే ఏకైన విధానమని పేర్కొన్నారని సెనెట్ కమిషన్ నివేదిక పేర్కొంది. సీపీఐ పేర్కొన్న మొత్తం 65 మందిలో 11 మంది కోవాగ్జిన్ అక్రమాలకు పాల్పడ్డారు. బోల్సోనారో అక్రమాలను వెలుగు లోకి రావడానికి ప్రధాన కారణం కోవాగ్జిన్ అని చెప్పాలి.
ఎందుకంటే అప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం లభించని ఈ టీకాల కోనుగోలుకు భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకోవడంతో దీనిపై మీడియా సంస్థలు లోతుగా కూపీ లాగాయి. అంతకు ముందు టీకాల (విజిల్ బ్లోయర్) విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడటం మీడియా సంస్థలు మరింత లోతుగావెళ్లి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు చెలరేగడంతో ఈ కుంభకోణంపై దర్యాప్తుకు సీపీఐ కమిటీ ఏర్పడింది.