Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్వాసిపై హత్య కేసు నమోదు
లండన్: బ్రిటన్ ఎంపీ డేవిడ్ ఆమెస్ హత్య ఘటనకు సంబంధించి బ్రిటీస్ పోలీసులు ఒక 25 ఏండ్ల వ్యక్తిపై గురువారం కేసు నమోదు చేశారు. అలీ హర్బి అలీ అనే సొమాలియా వారసత్వానికి చెందిన లండన్వాసిపై హత్య, ఉగ్రవాద నిరోధక చట్టం-2006 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ఉగ్ర సంబంధాలు ఉన్నాయనీ, ఇది ఒక ఉగ్రవాద చర్య అని పోలీసులు పేర్కొన్నారు. దీని వెనుక మత, సైద్ధాంతికపరమైన ప్రేరణలు ఉన్నాయని స్పెషల్ క్రైమ్ అండ్ కౌంటర్ టెర్రరిజం డివిజన్ అధికారి నిక్ ప్రిన్స్ చెప్పారు. సొమాలియా మాజీ ప్రధానికి మీడియా సలహాదారుగా పనిచేసిన వ్యక్తి కుమారుడే అలీ అని, ఆయన్ను లండన్ వెస్టుమినిస్టర్స్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కంజర్వేటివ్ పార్టీకి చెందిన 69 ఏళ్ల ఎంపి ఆమెస్ గత శుక్రవారం లండన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక చర్చిలో వరుస కత్తిపోట్లతో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం మరో ఎంపిని కూడా దుండుగులు హత్య చేశారు. ఈ హత్యల నేపథ్యంలో బ్రిటన్ రాజకీయ వర్గాలు తీవ్ర కలవరపాటుకు గురయ్యాయి. పార్లమెంట్ సభ్యులకు కల్పిస్తున్న భద్రత, రక్షణను పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.