Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: తాలిబన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు మరణించిగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం ఈ దారుణంగా జరిగింది. తాలిబన్ల వాహనాన్ని లక్ష్యంగా రోడ్డు పక్కన అమర్చిన బాంబును పేల్చారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యలుగా ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రకటించకపోయినా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదుల పనిగా దీనిని భావిస్తున్నారు. గత వారంలో దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని ఒక షియా మసీదుపై ఐఎస్ చేసిన దాడిలో 47 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.