Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: అణు జలాంతర్గాములను అణుశక్తిలేని దేశానికి అందించే విధంగా ఆకస్ కూటమి ఒప్పందంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) డెరెక్టర్ జనరల్ రీఫెల్ గ్రోస్సి ఆందోళన వ్యక్తం చేశారు. 'అణు రక్షణ, భాగస్వామ్య చట్టపరమైన చిక్కులను పరిశీలించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు' ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ మధ్య కొత్త త్రైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ గ్రోస్సి తెలిపారు. ఇలాంటి ఒప్పందాన్ని ఇతర దేశాలు అనుసరించవచ్చునని, అణు జలాంతర్గాములను నిర్మించడానికి ప్రయత్నించవచ్చునని ఆందోళనవ్యక్తం చేశారు. 'ఇది తీవ్రమైన విస్తరణవాదాన్ని, చట్టపరమైన ఆందోళనలను పెంచుతుందని' హెచ్చరించారు. అణుశక్తి జలాంతర్గామిలను తయారుచేయడంలో ఆస్ట్రేలియాకు మద్దతు ఇస్తామని అమెరికా, బ్రిటన్ సెప్టెంబరు 15న ఒక ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగితే అణ్వాయుధాలు లేని ఒక దేశం అణుశక్తి జలాంతర్గాములను పొందడం ఇదే మొదటిసారి అవుతుంది.