Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు తాలిబన్లు విజ్ఞప్తి
కాబూల్: 20 ఏళ్లపాటు ఆఫ్గనిస్తాన్ ప్రజలపై అమెరికా చేసిన దుశ్చర్యలను తాలిబన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడులకు పరిహారం ఇవ్వాలని అమెరికాకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెలలో అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన 10 మంది ఆఫ్గనీయుల బంధువులకు పరిహారం ఇస్తామని ఈ నెల 14న అమెరికా మిలటరీ ప్రకటించింది. దీనిపై తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లాహ ముజాయిద్ తీవ్రంగా స్పందించారు. 'దీని వలన ఉపయోగం లేదు. ఆఫ్గన్ ప్రజలను దారుణంగా చంపడం అమెరికాకు ఇదే మొదటిసారి కాదు. గత 20 ఏళ్లుగా అమెరికా ఇదే చేస్తోంది. మన ప్రజల ముందు, యావత్తు ప్రపంచం ముందు అమెరికా మూర్ఖత్వం, అమెరికా నిజస్వభావం బట్టబయిలయింది' అని చైనా గ్లోబుల్ టెలివిజన్ నెట్వర్క్ (సిజిటిఎన్)తో మాట్లాడుతూ ముజాయిద్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్లపై అమెరికా తన దురాగతాలకు పాల్పడిన ప్రతీచోటా పరిహారం చెల్లించాలని ఉద్ఘాటించారు. సెప్టెంబరు మధ్యలో కాబూల్‌లోని ఒక కారుపై అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఏడుమంది చిన్నారులతో సహా 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.