Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస వేదికగా వ్యతిరేకించిన 80కి పైగా దేశాలు
యునైటెడ్ నేషన్స్: మానవ హక్కుల పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని దాదాపు 80కి పైగా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ మూడో కమిటీ సమావేశాల్లో చైనాకు మద్దతు ప్రకటించాయి. చైనాలో మానవ హక్కుల సమస్యల నెలకొందంటూ బురద చల్లేందుకు పలుదేశాలు చేసిన ప్రయత్నాలు ఈ వేదిక సందర్భంగా విఫలమయ్యాయి. చైనా తీసుకున్న స్టాండ్‌కు 62 దేశాల తరపున క్యూబా, మూడు గల్ఫ్ దేశాల తరపున కువైట్, వ్యక్తిగతంగా మాట్లాడిన ఇతర దేశాలతో సహా 80కి పైగా దేశాలు మద్దతు పలికాయి. దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంతో పాటు సార్వభౌమాధికార దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటివి అంతర్జాతీయ సంబంధాల బలోపేతానికి ప్రాథమిక నిబంధనలను సూచిస్తుందని క్యూబా సంయుక్త ప్రకటనలో పేర్కొంది. హాంకాంగ్, జిన్జియాంగ్, టిబెట్ వంటి అంశాలు చైనా అంతర్గత వ్యవహారాలని, బయటి శక్తుల జోక్యం తగదని ఈ ప్రకటన నొక్కిచెప్పింది. అదేవిధంగా హాంకాంగ్ ప్రత్యేక పాలిత రీజియన్‌లో చైనా అమలు చేస్తున్న 'ఒక దేశం-రెండు వ్యవస్థలు' అనే విధానానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది. మానవ హక్కుల అంశాలపై రాజకీయం చేయడం, దురుద్దేశం, తప్పుడు సమాచారంతో ద్వంద్వ ప్రమాణాలు అవలంభిస్తూ చైనాపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించింది. మూడు గల్ఫ్ దేశాల తరపున కువైట్ ఉమ్మడి ప్రకటన చేసింది. మానవ హక్కుల సమస్యలపై లక్ష్యం, నిర్మాణాత్మక, రాజకీయేతర సూత్రాన్ని నొక్కిచెప్పింది అన్ని దేశాలు ఐరాస చార్టర్, మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్ సూత్రాలను అనుసరించాలని పేర్కొంది. ఇంకా 20కి పైగా ఇతర దేశాలు చైనాకు మద్దతుగా ప్రకటనలు చేశాయి.
నిరాధార ఆరోపణలు : జాంగ్
భేటీ సందర్భంగా ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధిగా ఉన్న జాంగ్ జున్ అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో జాంగ్ మాట్లాడుతూ.. చైనాపై నిరాధారమైన ఆరోపణలకు అమెరికా, కొన్ని ఇతర దేశాలు మూడవ కమిటీ వేదికను మరోసారి దుర్వినియోగం చేశాయని అన్నారు.