Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబాకు అమెరికా బెదిరింపులు
వాషింగ్టన్: క్యూబాపై అమెరికా మరోసారి బెదిరింపులకు దిగింది. వచ్చే నెల 15న నిర్వహించతలపెట్టిన ప్రతిపక్షాల మార్చ్ నిర్వాహకులు, ప్రచారకర్తలపై కేసులు పెడితే క్యూబా అధికారులపై మరిన్ని ఆంక్షలకు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు లాటిన్ అమెరికాకు సంబంధించి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ప్రధాన సలహాదారుగా ఉన్న జువాన్ గొంజాలెజ్ వ్యాఖ్యలు చేశారని స్పానిస్ ఏజెన్సీ ఇఎఫ్ఇ పేర్కొంది. ఈ మార్చ్ వెనుక అమెరికా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అనుమతిని నిరాకరించినప్పటికీ, నిర్వాహకులు నవంబర్ 15వ తేదీన మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించినందుకు కేసులు నమోదు చేసిన సందర్భంలో క్యూబా అధికారులపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు జువాన్ పైవిధంగా స్పందించారు.