Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాంగ మంత్రికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచన
అంకారా : టర్కీ అధ్యక్షులు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ శనివారం కీలక ఆదేశాలు జారీచేశారు. జైలులో ఉన్న పౌర సామాజిక నేతను విడుదల చేయాలని కోరిన 10 దేశాల రాయబారులను బహిష్కరించాలని విదేశాంగ మంత్రికి సూచించారు. ఈ జాబితాలో అమెరికా, జర్మనీ కూడా ఉన్నాయి. పారిస్లో జన్మించిన సామాజిక కార్యకర్త ఒస్మాన్ కవాలాను నిరంతరంగా నిర్బంధించడం టర్కీకి చెడ్డపేరు తీసుకొస్తుందని పేర్కొంటూ రాయబారులు ఈనెల 18న ఒక అసాధారణమైన ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ''ఈ 10 మంది రాయబారులను వీలైనంత త్వరగా పర్సనల్ నాన్ గ్రాటాగా ప్రకటించాలని నేను మా విదేశాంగ మంత్రిని ఆదేశించాను'' అని ఎర్డోగన్ పేర్కొన్నారు. బహిష్కరణకు ముందు మొదటి దశగా ఆయన పర్సనల్ నాన్ గ్రాటాగా దౌత్య పదాన్ని ఉపయోగించారు. టర్కీ గురించి తెలుసుకోలేని రోజున వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నారు. తమకు ఇంతవరకు అధికారిక ఉత్తర్వులు అందలేదని పలు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి ఇతర తొమ్మిది దేశాలతో తాము సంప్రదింపులు చేస్తున్నామని జర్మనీ విదేశాంగ శాఖ తెలిపింది.