Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కీలకమైనది.. : నిపుణులు
బీజింగ్ : పశ్చిమ పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా, రష్యా నావికా దళాలు తొలిసారిగా ఉమ్మడి గస్తీ చేపట్టాయి. ఈనెల 17 నుంచి 23 వరకు ఈ సముద్ర గస్తీ నిర్వహించినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. కాగా, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అమెరికా వంటి దేశాలకు చైనా, రష్యాలు చేపట్టిన ఈ ఉమ్మడి అడుగు స్పష్టమైన సంకేతాలు పంపినట్లైందని, ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో చాలా ముఖ్యమైనదని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. గస్తీ కార్యక్రమంలో రెండు దేశాలకు చెందిన 10 యుద్ధ నౌకలు, ఆరు క్యారియర్ ఆధారిత హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నౌకా విన్యాసాలతో పాటు లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించారు. ఈనెల 14 నుంచి 17 వరకు జపాన్ సముద్రంలో ఉమ్మడి నౌకా విన్యాసాలు జరిగిన తర్వాతనే తాజా సముద్ర గస్తీ కార్యక్రమాన్ని జరపడం గమనార్హం. ఇది సముద్ర భద్రతా బెదిరింపులను ఎదుర్కోవటానికి చైనా, రష్యా నౌకాదళాల సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ)కి చెందిన నావల్ రీసెర్చ్ అకాడమీ సీనియర్ రీసెర్చ్ ఫెలో జాంగ్ జున్షే శనివారం గ్లోబల్ టైమ్స్‌తో అన్నారు.
ఉమ్మడి నేవీ డ్రిల్ తర్వాత క్రాసింగ్, జాయింట్ మొబిలిటీ, లైవ్ ఫైర్‌తో సహా నిర్వహించిన పలు విన్యాసాలు వాస్తవ పోరాట పరిస్థితికి దగ్గరగా ఉంటాయని, బలగాల నిరంతర కార్యాచరణ సామర్థ్యాన్ని పరీక్షించడంతో పాటు మెరుగుపరచగలవని అన్నారు. పశ్చిమ పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా, రష్యా సంయుక్తంగా చేపట్టిన ఈ గస్తీ కవ్వింపుదారులకు స్పష్టమైన సంకేతాలు పంపడంలో, వాస్తవిక కసరత్తులో నిర్వహించడంతో ప్రాధాన్యత కలిగివుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా, రష్యా శాశ్వత సభ్య దేశాలని, ప్రపంచ శాంతిని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్నాయని పేర్కొన్నారు. తాజా విన్యాసాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక విశ్వాసాన్ని పెంచుతాయని, ఆధునిక యుగంలో రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తుందని, అలాగే అంతర్జాతీయ, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతుందని జాంగ్ పేర్కొన్నారు. మిలటరీ నిపుణుడు సాంగ్ జోంగ్‌పింగ్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, తాజా ఉమ్మడి సముద్ర గస్తీ అధిక స్థాయిలో వాస్తవ పోరాటాన్ని చూపించిందని అన్నారు. చైనా, రష్యా సైనిక సహకారంలో ప్రతిస్పందించే సామర్థ్యం వేగంగా మెరుగుపడుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ఉమ్మడి గగనతల, నేవీ గస్తీ పెరుగుతుందని అన్నారు.