Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగొటా : కొలంబియా మోస్ట్‌వాంటెడ్ మాదకద్రవ్యాల రవాణాదారుడు, దేశంలో అతిపెద్ద క్రిమినల్ గ్యాంగ్‌కు నాయకుడు డైరో అంటోనియా సుగాను అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షులు ఇవాన్ డ్యూక్ ఈ విషయాన్ని వీడియో మెసెజ్ ద్వారా వెల్లడించారు. సైన్యం, ఎయిర్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతన్ని అరెస్టు చేశారు. డైరో అంటోనియా సుగా ఒటోనైల్గా బాగా ప్రాచుర్యం పొందాడు. అంటోనియా సుగా అరెస్టులతో డ్రగ్స్ అక్రమ రవాణాపై అతి పెద్ద దెబ్బ పడినట్లుగా అధ్యక్షులు డ్యూక్ చెప్పారు. పశ్చిమ కొలంబియాలోని ఆంటికా ప్రావిన్స్‌లో అంటోనియా సుగాను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు 500 మంది సైనికులు 22 హెలికాప్టర్లను వినియోగించారు. ఈ ఆపరేషన్‌లో ఒక భద్రతాధికారి మరణించారు. అంటోనియా భద్రతా దళాలను తప్పించుకోవడానికి మారుమూల గ్రామాల్లో పలు ఇళ్లను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఫోన్ కూడా వినియోగించడు. కేవలం కొరియర్ల కమ్యూనికేషన్ మీదే ఆధారపడతాడు. అతను ఉన్న ప్రదేశంపై రెండు వారాలుగా దళాలు నిఘా వేసి ఆపరేషన్ నిర్వహించాయి. అమెరికా, ఇంగ్లండ్ దళాలు కూడా సోదాలో పాల్గొన్నాయి.