Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమల్లా : వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ ఆవాసాల్లో 1355 కొత్త ఇండ్లను నిర్మించేందుకు టెండర్లను జారీ చేసిన ఇజ్రాయిల్ చర్యను పాలస్తీనా ఖండించింది. ఈ మేరకు ఆదివారం పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. పాలస్తీనా భూభాగాల్లో ఆవాసాల నిర్మాణాన్ని కొనసాగించడమన్నది ఇజ్రాయిల్ అధికారిక వైఖరని ఈ చర్య తెలియచేస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. ఆవాసాల నిర్మాణాన్ని తిరస్కరిస్తున్న అంతర్జాతీయ, అమెరికా వైఖరులను పట్టించుకోకుండా ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఆవాసాల నిర్మాణం సాగుతోందని విమర్శించింది. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారం ఆధారంగా శాంతిని సాధించే అవకాశాలపై ఇటువంటి వినాశకరమైన ప్రాజెక్టుల పర్యవసానాలు వుంటాయని హెచ్చరించింది. అన్ని లక్ష్మణ రేఖలను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలకు ఎదురయ్యే పర్యవసానాలకు ఇజ్రాయిల్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుందని స్పష్టం చేసింది.