Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్బన ఉద్గారాల తగ్గింపుపైనే ప్రధాన చర్చ!
- బడ్జెట్‌కు ధనిక దేశాలు అంగీకరించేనా?
నవతెలంగాణ-గ్లాస్గో
ప్రపంచ పర్యావరణ 26వ సదస్సు అక్టోబర్ 31 నుంచి నవరబర్ 12 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగనున్నాయి. 2015లో ప్యారిస్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం 2030 నాటికి తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. వాతావరణ లక్ష్యాల ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ల కంటే తక్కువకు పరిమితం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించి 2010 నాటి స్థాయికి తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. దీనికి 197 దేశాలూ అంగీకరించాయి. 2030 నాటికి లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయా దేశాలు జాతీయయంగా నిర్దేశిత ప్రణాళికలు(ఎన్డీసీ) రూపొందించుకున్నాయి. కాలుష్యానికి ప్రధాన కారణం ప్రాశ్చాత్య దేశాలే. జనాభా 30 శాతం ఉన్న ఆ దేశాలు ప్రపంచానికి పర్యావరణంగా పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూరుస్తున్నాయి. 100 పేద, వర్ధమాన దేశాల కర్బన ఉద్గారాల వాటా 3.6 శాతం మాత్రమే. అయినా ఎక్కువ ప్రభావం ఈ దేశాలపైనే ఉంటున్నది. ఆ దేశాల్లో తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. అనేక వన్యప్రాణులు వేగంగా అంతరించిపోతున్నాయి. హరిత గృహ వాయువుల(గ్రీన్ హౌస్ ఎఫెక్ట్)ను తగ్గించేందుకు రూ.7.49 లక్షల కోట్ల బడ్జెట్ ఏటా అవసరమవుతుంది. ప్రస్తుత సదస్సు అన్ని కోణాల్లో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.