Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ట్రస్టీల రాజీనామా
- లండన్‌లోని ప్రతిష్టాత్మక సైన్స్ మ్యూజియం గ్యాలరీ స్పాన్సర్‌షిప్‌ను నిరాకరిస్తూ..
బ్రిటన్: వాతావరణ మార్పులపై లండన్‌లోని ప్రతిష్టాత్మక సైన్స్ మ్యూజియం గ్యాలరీకి అదానీ స్పాన్సరర్‌గా నిలిచారు. అయితే, అదానీ గ్రూప్ కంపెనీ స్పాన్సరర్‌గా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ మ్యూజియ ంనకు చెందిన ఇద్దరు ట్రస్టీలు రాజీనామా చేశారు. లండన్‌లోని సైన్స్ మ్యూజియం గ్రీన్ ఎనర్జీపై గ్యాలరీని ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ కొత్త గ్యాలరీ వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచాన్ని సంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్ ఎనర్జీకి మార్చడానికి సహాయపడుతుంది. అయితే, దీనికి అదానీ గ్రూప్ కంపెనీ స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చింది.
ఏం జరిగింది..?
బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమక్షంలో మ్యూజియంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా అదానీని టైటిల్ స్పాన్సర్‌గా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. సైన్స్ మ్యూజియం బోర్డ్ అనేది యూకే ప్రభుత్వం అజమాయిషీలో.. సంస్కృతి, మీడియా , క్రీడల విభాగం నుంచి నిధులను పొందే ఒక పబ్లిక్ బాడీగా ఏర్పాటు చేశారు. స్వతంత్రంగా పనిచేసేలా బాధ్యతలు అప్పగించింది.
ప్రధానంగా..వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్ ఎనర్జీకి మార్చడానికి దారితీసే భావనలను వ్యక్తపర్చేలా ఈ కొత్త గ్యాలరీని ఏర్పాటు చేయాలని భావించారు. తద్వారా ప్రపంచ పర్యావరణానికి మేలు జరిగేలా ప్రతిపాదనలు తెరపైకి వచ్చేలా డిజైన్ చేశారు.
అదానీకి వద్దు...
అదానీకి సంబంధించిన పలు వివాదస్పదమైన అంశాలు ముడిపడి ఉండటంతో..అదానీ గ్రూపునకు గ్యాలరీ బాధ్యతలు అప్పగించటాన్ని ట్రస్టీలు వ్యతిరేకించారు.ఆస్ట్రేలియా నుంచి భారత్ సహ పలు దేశాల్లో అదానీ సంస్థలు పర్యావరణానికి కలిగిస్తున్న నష్టాలను పరిగణనలోకి తీసుకున్న, ఆ ఇద్దరు ట్రస్టీలు రాజీనామా చేశారు. వీరిలో ఒకరు డాక్టర్ హన్నా ఫ్రై. హన్నా యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అదానీతో జరిగిన ఒప్పందాన్ని నేను సమర్థించనని డాక్టర్ హన్నా ఫ్రై చెప్పారు. ఇక రాజీనామా చేసిన మరో ట్రస్టీ డాక్టర్ జో ఫోస్టర్. యూకేలోని ఛారిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కూల్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇద్దరి రాజీనామాలను బోరిస్ సర్కార్ వెంటనే ఆమోదించటం గమనార్హం.