Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోమ్ నుంచి గ్లాస్గోకు పాకిన నిరసనలు
- పర్యావరణానికి హాని చేయోద్దంటూ నినాదాలు.. మహాప్రదర్శనలతో దద్దరిల్లుతున్న మహా నగరాలు
- పాల్గొన్న వాతావరణ కార్యకర్తలు, కార్మికులు, విద్యార్థులు
రోమ్‌లో జీ 20 దేశాల సదస్సుకు వివిధ దేశాధినేతలు హాజరైతే.. బయట ప్రపంచ మానవాళికి కలుగుతున్న హాని గురించి పర్యావరణవేత్తలు గళమెత్తారు. అభివృద్ధికోసం పర్యావరణానికి తూట్లు పొడిచే నిర్ణయాలు తీసుకుంటున్న జీ 20 దేశాల అధినేతలతీరును ఎండగట్టారు. మీరు జీ 20, మేం భవిష్యత్తు అంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లతో సదస్సు జరిగిన రోజుల్లో నిరసనకారులు ఆందోళనలు చేశారు. పుడమితల్లిని కాపాడుకుందామంటూ ప్రతినబూనారు. ఇటలీలో జీ 20 సదస్సు ముగిశాక.. స్కాట్లాండ్లోని గ్లాస్గోలోనూ కాప్ 26 పేరిట క్లైమేట్ సమ్మిట్ షురూ అయింది. రోమ్ నుంచి మొదలైన పర్యావరణ వేత్తల నిరసన జ్వాల ఇపుడు గ్లాస్గోకూ పాకింది.
రోమ్ : జీ20 దేశాల సదస్సు జరుగుతున్న ఇటలీ రాజధాని రోమ్‌లో చివరిరోజూ నిరస నలుకొనసాగాయి.. ఆందోళనకారులు నినాదాలతో హెరెత్తించారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ప్రతిఘటన ఉద్యమానికి సంబంధించిన పాటలు పాడుతూ ర్యాలీలు నిర్వ హించారు. '' మీరు జీ20, మేం భవిష్యత్తు'' అంటూ నినాదాలను వినిపిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నిరసన ర్యాలీలో ముఖ్యంగా వాతావరణ కార్యకర్తలు, కార్మిక సంఘాల సభ్యులు, ఇటలీ దేశ ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక రోమన్లతో పాటు పలువురు పాల్గొని పలు అంశాల్లో తమ ఆందోళనను తెలియజేశారు. ఈ ర్యాలీలో దాదాపు 5వేల మంది పాల్గొన్నారని ఇటలీ పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం. అయితే, ఈ సంఖ్య అధికారులు తెలిపినదాని కంటే రెట్టింపు ఉంటుందని ఆందోళనలు చేపట్టిన నిర్వాహకులు చెప్పారు. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణ నెలకొన్నది. నిరసనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని స్థానిక అధికారి గియోవన్ని బొర్రెల్లి తెలిపారు. ముఖ్యంగా, వాతావరణ మార్పుల విషయంలో పర్యావరణవేత్తలు, కార్యకర్తలు తమ ఆందోళనను తెలియజేశారు. ''జీ20కి ప్రత్యామ్నాయం మేమే'' అని నిరసనలో పాల్గొన్న సిగ్లియానా అన్నారు. '' ఇది అక్టోబర్ 30. చాలా వేడిగా ఉన్నది. ఇది నన్ను భయపెడుతున్నది'' అని వాతావరణ మార్పుల విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మేము ఎదుర్కొనే సమస్యలను జీ20 నాయకులు రిప్రెజెంట్ చేయలేదని సారా డెగెన్నరో అనే విద్యార్థి వాపోయారు. ''క్యాప్టలిజమ్ ఈస్ డెత్'' అనే బ్యానర్‌తో అస్థిపంజరం కాస్ట్యూమ్ ధరించిన స్పెయిన్ వ్యక్తి ఫెలైప్ గోన్జలెజ్ తన ఆందోళనను తెలియజేశారు. రెండు రోజుల జీ 20 సమ్మిట్ అక్టోబర్ 30న రోమ్ నగరంలో ప్రారంభమైన విషయం విదితమే.
గ్లాస్గోకు పాకిన ఆందోళనలు
ఇక వాతారణ మార్పు విషయంలో పర్యావరణవేత్తలు, కార్యకర్తల నిరసనలు 'కాప్26 క్లైమేట్ సమ్మిట్'కు తాకింది. ఈసమావేశం జరుగుతున్న స్కాట్లాండ్ దేశం లోని నగరం గ్లాస్గోలో వేలాది మంది ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన కారులు వేలాది మందిగా గ్లాస్గోకు ర్యాలీగా బయలుదేరారు. ప్లకార్డులు ప్రదర్శిం చారు. మరికొందరు, ఆలోచింపజేసే విధంగా కాస్ట్యూమ్స్ ధరించారు. నాయకుల నుంచి ఫలితాలులేని నిర్ణయాలుఆశించడం లేదంటూప్లకార్డులతో తమ అసంతృ ప్తిని తెలియజేశారు. సమావేశం ఫలవంతంగా జరగాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు.