Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఏడేండ్లు అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డు
- 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే అవకాశం : ప్రపంచ వాతావరణ సంస్థ
గ్లాస్గో: అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం కొనసాగుతుండటం భూ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్త ంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతూ.. జీవజాతుల మనుగడపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కాప్-26 సదస్సు నేపథ్యంలో డబ్ల్యూఎంవో తన తాజా నివేదికను విడుదల చేసింది. దానిలో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021.. అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డుల్లోకి ఎక్కే అవకాశముందని వెల్లడించింది. ఏడాది ముగిసేసరికి 2021 అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో 5-7 స్థానాల మధ్య ఉండే అవకాశముందని పేర్కొంది. లానినా ప్రభావంతో ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనా అలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక యుగం ముందునాటితో పోలిస్తే 2021లో సగటు ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉందని తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి సముద్ర మట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పుందని పేర్కొంది. అనేక జీవజాతులు అంతరించిపోవడంతో పాటు, అరుదైన జీవజాతుల మనుగడపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.