Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమాయక నిరసనకారుల హంతకుడు మోడీ
- యూకేలో ప్రవాస భారతీయులు ఆందోళన
గ్లాస్గో : దేశంలోని చారిత్రాత్మక రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రవాస భారతీయులు గ్లాస్గో (యూకే)లో ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. ''భారత రైతుల పోరాటం మా పోరాటం'' అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని, మోడీని ''వందలాది మంది అమాయక నిరసనకారులహంతకుడిగా'' పేర్కొన్న బ్యానర్లతో భారత సంతతికి చెందిన ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. దేశంలో నిరసన తెలుపుతున్న రైతులకు తమ మద్దతును అందించారు. స్కాట్లాండ్లో మోడీకి స్వాగతం లేదని నిరసనకారులు బ్యానర్లు పట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి కాప్ 26 సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ గ్లాస్గోను చేరుకున్న సమయంలో ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులచే అందిస్తున్న బలమైన సంఘీభావం, మద్దతును ఎస్కేఎం అభినందిస్తుంది. భారత ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాలని వారిని కోరింది. సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఎస్కేఎం ఆశిస్తుంది. రైతుల ఉద్యమం న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్కేఎం డిమాండ్ చేస్తుంది.