Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు
కాబూల్ : ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒక మిలటరీ ఆస్పత్రిపై మంగళవారం సాయుధులు జరిపిన దాడిలో 19 మంది మరణించగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి గేటు వద్ద ఒక మానవ బాంబు తన ఆయుధాలు పేల్చుకుని దాడిని ప్రారంభించగా, తరువాత సాయుధులు ఆస్పత్రిలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. '19 మృతదేహాలను స్వాధీనం చేసకున్నాం, 50 మందిని ఇతర ఆస్పత్రులకు తరలించాం' అని తాలిబాన్ల ప్రభుత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. దాడికి పాల్పడిన సాయుధులంతా హతమైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇంకా సంస్థా ప్రకటించలేదు. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇలాంటి దాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం దాడి జరిగిన ఆస్పత్రిలో తాలిబాన్ల సైనికులకు, ఆఫ్ఘన్ మాజీ ప్రభుత్వా దళాల సైనికులకు చికిత్స చేస్తుంటారు. 2017లోనూ ఈ ఆస్పత్రిపై దాడి జరిగింది. అప్పుడు వైద్య సిబ్బంది వేషంలో ఆస్పత్రిలో ప్రవేశించిన సాయుధులు 30 మందిని హత్య చేశారు.